18 రాష్ట్రాల్లో ఉన్న పులుల సంఖ్య ఎంతంటే..

18 రాష్ట్రాల్లో ఉన్న పులుల సంఖ్య ఎంతంటే..

దేశంలోని 18 రాష్ట్రాల్లోని 50 టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ల్లో పులుల గణన జరిగింది. అయితే... గతంతో పోలిస్తే వీటి సంఖ్య 20 నుంచి 30 శాతం ఉందంటున్నారు. 2006 నుంచి ఇప్పటి వరకు 13 ఏళ్ల గణాంకాలు తీసుకుంటే.. 2006 లో 1411 పులులు ఉండేవి. 2010 లో 1706 ఆ తర్వాత 2014 లో 2226 పులులు మాత్రమే ఉన్నాయి. గత ఏడాదిలో ఈ సంఖ్య 2894 లకు చేరుకుంది...

పులులను లెక్కించేందుకు ప్రత్యేక పద్ధతులను అవలంభిస్తారు. ఇందులో ఒకటి పగ్ మార్క్స్ యూనిక్ . ఈ విధానంలో పులి పాదముద్రల్ని లెక్కిస్తారు. మోడ్రన్ పద్దతులు రాక ముందు ఈ విధానంలో ఎక్కువగా చేసేవారు. ఇక రేడియో కాలర్‌ ద్వారా లెక్కగట్టడమే రేడియో కాలర్ విధానం. ఐతే నీటిలో నానితే ఈ పరికరం పనికి రాకుండా పోయి పులుల గణన సంక్లిష్టంగా మారే అవకాశాలు ఉంటాయి..

ఇక.... పులులు విసర్జించే వ్యర్థాలు, ఫిరమోన్స్ లాంటి ఇతర రసాయనాలను సేకరించి, వాటి డీఎన్ఏ లను విశ్లేషించడం ద్వారా వాటి సంఖ్యను లెక్కగట్టడాన్ని పూప్ స్కాట్ విధానం అంటారు. ఇది కొంత కచ్చితమైన సమాచారం. పులుల గణన కోసం భారత పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ మూడు పద్దతులను అనుసరిస్తోంది..

శాటిలైట్ డేటా ద్వారా పులుల నివాస ప్రాంతాల లక్షణాలను సేకరించడం? వీటిలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలు కలిసి విశ్లేషించడం.. కెమెరా ట్రాప్ విధానంలో సేకరించిన పులుల రద్దీ ప్రాంతాలను కంప్యూటర్లకు ఎక్కించి లెక్కించడం వంటివి ఉన్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2006 లో పులుల సంఖ్య 95 గా ఉంది. 2010 లో ఆ సంఖ్య 72 కు తగ్గింది. 2014 లో పులుల సంఖ్యను లెక్కించలేదు. కానీ వాటి సంఖ్య మరింత దిగజారి 68 కి చేరింది. వీటిలో 48 పులులు ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. తెలంగాణాలో 20 ఉంటే ఇందులో ఆమ్రాబాద్ లో 17 పులులు, కవ్వాల్ అటవీ ప్రాంతంలో 3 ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story