ఇసుక దొరక్క మా పార్టీ ఆఫీస్ నిర్మాణం కూడా నిలిచిపోయింది: పవన్

ఇసుక దొరక్క మా పార్టీ ఆఫీస్ నిర్మాణం కూడా నిలిచిపోయింది: పవన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరత చాలా తీవ్రంగా ఉందన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఇసుక దొరక్క.. తమ పార్టీ ఆఫీస్ నిర్మాణం కూడా నిలిచిపోయిందని అన్నారు. క్షేత్రస్థాయి నుంచి జనసేన బలోపేతంపై మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు.

వైసీపీ ప్రభుత్వానికి తాము వంద రోజుల సమయం ఇస్తున్నట్టు పవన్ చెప్పారు. ఆ తర్వాత జగన్ పాలనపై స్పందిస్తామని అన్నారాయన. ప్రజా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే.. ఆందోళనకు సిద్ధమవ్వాలని కేడర్‌కు, లీడర్‌కు పవన్ సూచించారు. ఇటీవలి ఎన్నికల్లో పొత్తు కోసం టీడీపీ, వైసీపీ తమను సంప్రదించాయని.. ఒంటరిగా పోటీ చేయాలనే ఉద్దేశంతోనే.. ఎవ్వరితోను పొత్తు పెట్టుకోలేదని జనసేనాని స్పష్టంచేశారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. జనసేన పార్టీ తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, కార్యకలాపాల గురించి బిశ్వభూషణ్‌ హరిచందన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story