బిగ్‌బాస్ ఇంట్లోకి రేణూ.. !!

బిగ్‌బాస్ ఇంట్లోకి రేణూ.. !!
X

అప్పుడప్పుడూ అభిమానులతో తన అంతరంగాన్ని షేర్ చేసుకుంటానే తప్ప అస్తమాను కెమెరా ముందు వుండాలంటే నావల్ల కాని పని. అందుకే బిగ్‌బాస్ ఆఫర్ ఇచ్చినా వెళ్లలేదు. అయినా 100 రోజులు అందరికీ దూరంగా, ముఖ్యంగా పిల్లల్ని వదిలేసి ఉండడం చాలా కష్టం. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండాలంటే చాలా కష్టం. కనీసం గెస్టుగా కూడా బిగ్‌బాస్ హౌస్‌కి వెళ్లనని చెప్పుకొచ్చింది రేణూ దేశాయ్.

కవితలు రాసుకుంటూ, రెండు మూడు నెలలకోసారి అభిమానుల్ని పలకరిస్తూ ఉండడమే చాలా ఇష్టం అంటోంది. ఈ మధ్య రైతు సమస్యలపై ఓ సినిమా తీయడానికి రేణూ కెమెరా చేతపట్టింది. కాగా, రేణూ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించబోయే సినిమాలో హీరోకి అక్కగా నటిస్తోంది. తనకు మంచి రచయితగా, దర్శకురాలిగా, టెక్నీషియన్‌గా పేరు తెచ్చుకోవాలని ఉందని వివరించింది రేణూ దేశాయ్.

Next Story

RELATED STORIES