సమయానికి పెన్షన్ ఇవ్వకుండా అవ్వాతాతల ఉసురుపోసుకుంటున్నారు : నారా లోకేష్

సమయానికి పెన్షన్ ఇవ్వకుండా అవ్వాతాతల ఉసురుపోసుకుంటున్నారు : నారా లోకేష్

ఎడతెరిపిలేని వర్షాలు. చినుకులు వరదలయ్యాయి. గోదావరితో పాటు దాని ఉపనదులు కూడా పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఉభయగోదావరి జిల్లాలతో పాటు పలు లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. దీనికితోడు పోలవరం దగ్గర బ్యాక్ వాటర్ గిరిజన గ్రామాలను ముంచేస్తున్నాయి. కొద్దిమేర వర్షం ఎడతెరిపి ఇచ్చినా..రాబోయే రెండు మూడ్రోజులు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ చెబుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల జనం ఆందోళన చెందుతున్నారు.

ముసురు వర్షం ముంచేస్తుంటంతో జనం పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు విపక్ష నేత చంద్రబాబు నాయుడు. తమ ప్రభుత్వంలో హుద్ హుద్ తుఫాన్, తిత్లీ తుఫాన్ ను సమర్ధవంతంగా ఎదుర్కున్నామని చెబుతున్న ఆయన..ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వరదలు, కరెంటు కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించిన వారిని ఆదుకోవాలని సూచించారు. పాముల వల్ల చిన్నారుల ప్రాణాలు పోతున్నాయని.. నిర్లక్ష్యం చేయకుండా వారిని ఆదుకోవాలని ట్విట్టర్‌ ద్వారా చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

ప్రజాసమస్యలే లక్ష్యంగా లోకేష్ వరుస ట్వీట్లతో ప్రభుత్వం అటాక్ చేశారు. పెన్షన్ల విషయంలో జరుగుతున్న జాప్యాన్ని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారాయన. సమయానికి పెన్షన్లు ఇవ్వకుండా అవ్వాతాతల ఉసురుపోసుకుంటున్నారని సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు. రాష్ట్రంలో పెన్షన్లు అందుతున్న తీరుపై ట్విట్టర్లో విమర్శలు చేశారు. గతంలో ప్రతి నెలా ఒకటో తేదీన అందే పెన్షన్లు.. జగన్‌ సీఎం అయ్యాక సరిగ్గా అందడం లేదన్నారు.

గత నెలలో వారం దాటక పెన్షన్లు ఇచ్చారని.. ఈ నెల సగమే ఇచ్చారని విమర్శించారు. పించన్లు వెయ్యి పెంచుతామని హామీ ఇచ్చి.. తరువాత 250 మాత్రమే పెంచి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. అర్హులకు పెన్షన్‌ రావాలంటే వైసీపీ నాయకులు పెట్టిన హుండిలో 50 రూపాయలు వేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story