ఆర్టికల్‌ 370 రద్దు.. పాకిస్తాన్‌ వెన్నులో వణుకు?

ఆర్టికల్‌ 370 రద్దు.. పాకిస్తాన్‌ వెన్నులో వణుకు?

జమ్మూకశ్మీర్‌ స్వయం ప్రతిపత్తి రద్దుపై పాక్‌ విషం కక్కుతోంది. ఏదో తమ భూభాగాన్ని లాక్కున్నట్లు ముసలి కన్నీరు కారుస్తోంది. కశ్మీర్‌ వందకు వంద శాతం భారత భూభాగమే. అందులో నో డౌట్‌. దాన్ని కొత్తగా ఆక్రమించుకుంది లేదు. సైనికల చర్యతో లోబర్చుకుంది లేదు. అంతా రాజ్యంగం ప్రకారమే. కానీ దాని స్వయం ప్రతిపత్తి రద్దు చేయడంతో ఇప్పుడు పాక్‌ ఎందుకో వణికిపోతోంది. తమ దేశంలోని భూభాగాన్నే భారత్‌ ఆక్రమించుకుంది అన్నట్లు పెద్ద బిల్డప్‌ ఇస్తోంది. ఏదో జరిగిపోతోంది అంటూ అంతర్జాతీయ సమాజాన్ని పక్కదారి పట్టిస్తోంది.

జమ్మూకశ్మీర్‌ విభజనతో ఏమాత్రం సంబంధం లేనప్పటికీ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో కావాలని తలదూరుస్తోంది పాక్‌. ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ విభజనపై పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ విద్వేషపూరితమైన ప్రకటనలు చేసింది. కశ్మీర్‌ ఒక అంతర్జాతీయ వివాదమని.. అందులో తాము భాగస్వామిగా ఉన్నామని చెప్పుకొచ్చింది. అంతే కాదు భారత్‌ చట్టవ్యతిరేక చర్యల నియంత్రణకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని చెప్పుకొచ్చింది. కశ్మీరీల ప్రయోజనాల పరిరక్షణకు పాక్‌ కట్టుబడి ఉందంటూ ఓవర్‌ కటింగ్‌ ఇచ్చింది.

ఒక అడుగు ముందుకు వేసిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌... కశ్మీర్‌ విషయంలో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలంటూ వితండ వాదన తీసుకొచ్చారు. ఆర్టికల్ 370 రద్దును ఖండించిన ఇమ్రాన్‌.. భార‌త్‌ నిర్ణయంతో వివాదాస్పద ప్రాంతాన్ని మరింత జటిలం చేసిందంటూ మొసలి కన్నీరు పెట్టారు. ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారంటూ భారత్‌ అక్కుసు వెళ్లగక్కారు.

అసలు పాకిస్తాన్‌కు వెన్నులో వణుకు ఎందుకు? 370 రద్దు చేస్తే అది ఎందుకు హడలెత్తిపోతోంది? దానికి కారణం ఉంది. ఇన్ని రోజులు స్థానిక జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వం ఉదాసీనతతో రెచ్చిపోయిన పాక్‌.. భారత్‌పై ఉగ్రవాదులను ఎగదోసింది. అక్రమ చొరబాట్లతో రెచ్చిపోయింది. ఆర్టికల్‌ 370లోని బలహీనతలే అదనుగా మార్చుకున్న దాయాది.. చేయరాని అరాచకాలను చేసింది. కశ్మీర్‌లో మూకలు రెచ్చగొట్టడం. వేర్పాటు వాదులతో కలిసి అంశాంతిని, అలజడిని సృష్టించడం. కశ్మీర్‌ను పాక్‌ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మార్చడం.. ఇలా ఒకటేమిటి భారత్‌కు పక్కలో బల్లెంలా తయారైంది పాక్‌. ఈ నేపథ్యంలో పాక్‌ పీచమణాచాలంటే ముందు మన అంతర్గత భద్రతను మార్చుకోవాలి. అలా చేయాలంటే కశ్మీర్‌ను పూర్తిగా మన చేతుల్లోకి తీసుకోవాలి. ఇది జరగాలంటే జమ్మూకశ్మీర్‌ ప్రక్షాళన అవసరం. అందుకే జమ్మూకశ్మీర్‌ను విభజిస్తూ భారత దేశ అంతర్భాగంలోకి తీసుకొస్తూ మోదీ ప్రభుత్వం సంచనల నిర్ణయం తీసుకుంది. ఇదే ఇప్పుడు పాక్‌ను బెంబేలెత్తిస్తోంది. కశ్మీర్‌ మొత్తం భారత్‌ ఆధీనంలోకి వెళ్తే ఇక తమ ఆటలు సాగవని భయపడిపోతోంది. అంతే కాదు ఎక్కడ తాను ఆక్రమించుకున్న పీఓకేపై గురి పెడుతుందో అన్న భయం పాక్‌ను వెంటాడుతోంది.

Tags

Read MoreRead Less
Next Story