భారత్‌తో సంబంధాలపై పాక్‌ కీలక నిర్ణయం

భారత్‌తో సంబంధాలపై పాక్‌ కీలక నిర్ణయం

జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 , 35A ను నిలిపివేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో తమ దేశానికీ ఏదో తీవ్ర నష్టం జరిగిందన్నట్టు బిల్డప్ ఇస్త్తున్న పాక్ ప్రభుత్వం.. భారత్ పై తన అక్కసు వెళ్లగక్కుతోంది. ఈ నిర్ణయం వలన పుల్వామా తరహా ఘటనలు జరుగుతాయని నిస్సిగ్గుగా చెబుతూనే.. భారత్‌తో దౌత్య, వాణిజ్య సంబంధాలు నిలిపేయాలని నిర్ణయం తీసుకున్నారు ప్రధాని ఇమ్రాన్ ఖాన్. అంతేకాదు భారత్‌లో ఉన్న పాక్‌ రాయబారిని వెంటనే వెనక్కి రావాలని అలాగే.. పాక్‌లో ఉన్న భారత రాయబారిని వెంటనే దేశం విడిచి వెళ్లాలని హుకుం జారీ చేశారు. అలాగే కశ్మీర్‌ సమస్యను ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించాలని ఇమ్రాన్ సర్కార్‌ నిర్ణయించుకుంది.

Tags

Read MoreRead Less
Next Story