యూపీలో మంత్రివర్గ విస్తరణ.. సీనియర్ల పదవులకు ఏజ్‌ బార్‌ గండం

యూపీలో మంత్రివర్గ విస్తరణ.. సీనియర్ల పదవులకు ఏజ్‌ బార్‌ గండం
X

సీనియర్లను సైడ్ చేసి.. కొత్త వారికి కేబినెట్ లో చోటిస్తూ మంత్రివర్గ విస్తరణ చేపట్టారు యూపీ సీఎం. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం దక్కేలా మంత్రివర్గ విస్తరణ చేపట్టామని చెబుతున్నారు. అయితే.. కర్ణాటకలో లేని ఏజ్ లిమిట్ ఉత్తర ప్రదేశ్ లో ఎందుకు అంటూ రాజీనామా చేసిన సీనియర్లు నిరసనగళం వినిస్తున్నారు. ఇప్పుడప్పుడే ఎన్నికలు లేవు. కేబినెట్ విస్తరణ చేపట్టాలని పెద్దగా డిమాండ్లు కూడా లేవు. కానీ, ఎన్నికలకు రెండు ఏళ్లకుపైగా సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అన్ని సామాజిక వర్గాల మన్ననలు పొందేలా కేబినెట్ విస్తరణ చేపట్టారు యూపీ సీఎం యోగి ఆతిథ్యనాథ్.

మొత్తం 23 మందితో కేబినెట్ విస్తరణ చేపట్టారు యోగి. దీంతో మొత్తం మంత్రుల సంఖ్య 56కు చేరింది. అయితే.. సీనియర్లపై మాత్రం వేటు పడింది. 75ఏళ్లు నిండిన వారు పదవుల్లో ఉండకూడదనే భాజపా నిబంధన ప్రకారం పలువురు సీనియర్‌ మంత్రులు రాజీనామాలు చేశారు. ఆర్థికమంత్రి రాజేశ్‌ అగర్వాల్‌ సహా ఐదుగురు సీనియర్‌ మంత్రుల రాజీనామాలను గవర్నర్‌ ఆమోదించడంతో మంత్రివర్గంలో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. నీటిపారుదలశాఖ మంత్రి ధరమ్‌పాల్‌ సింగ్‌, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి అనుపమ జైస్వాల్‌, మైనింగ్‌ శాఖ మంత్రి అర్చన పాండే రాజీనామాలు చేసిన వారిలో ఉన్నారు. రాజీనాయా చేసిన సీనియర్ల మద్దతుదారులు ఆందోళనకు దిగుతున్నారు. కర్ణాటక తరహాలోనే 75 ఏళ్ల కటాఫ్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు సీనియర్ల అనుచరులు.

సీనియర్ల రాజీనామాలతో కేబినెట్ లో ఖాళీలు ఎక్కువగానే ఉంటడంతో కొత్త వారికి చోటు కల్పించారు యోగి ఆథిత్యనాథ్. గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆరుగురు కేబినెట్ మంత్రులు, మరో ఆరుగురికి స్వతంత్ర హోదా, 11మంది సహాయమంత్రులుగా ప్రమాణం చేశారు. ఇందులో కొత్తగా 18 మందికి సీఎం యోగి తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. సీఎం యోగి కొన్ని వర్గాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో అన్ని సామాజిక వర్గాలకు, అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేశామని చెబుతోంది యూపీ ప్రభుత్వం. సీనియర్‌ నాయకులతో పాటు యువ ఎమ్మెల్యేలకు సరైన ప్రాతినిథ్యం కల్పించాము అని చెబుతోంది.

Next Story

RELATED STORIES