అమెరికా అటవీప్రాంతంలో మరోసారి మంటలు

X
TV5 Telugu23 Aug 2019 2:37 PM GMT
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని అడవీప్రాంతంలో మంటలు వ్యాపించాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లోని ప్రజలను, స్కూళ్లు, కాలేజీల ఖాళీ చేసి సుదూరు ప్రాంతాలకు తరలించారు. సమీపంలో ఉన్న జాతీయ రహాదారిపై వాహనాల ప్రయాణాన్ని నిలిపివేశారు. శాంత కౌంటీ లోని బెల్లా విస్తా పట్టణం సమీపంలోని ఓ కొండపై మొదట మంటలు చెలరేగాయని, క్షణాల్లో అవి దావానలంగా వ్యాపించి, దాదాపు 240 హెక్టార్లను దహనం చేశాయని అటవీ రక్షణ శాఖఅధికారులు తెలిపారు. దీంతో మంటలు ఎప్పుడు తమ ప్రాంతాన్ని చుట్టుముడుతాయోనని బెల్లా విస్తా పట్టణంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక అధికారులు 4వేలమందిని సురక్షిత ప్రాంతానికి తరలించి, మంటలను ఆర్పేందుకు విమానాలు, హెలికాప్టర్ల సహాయంతో నిరంతరం శ్రమిస్తున్నారు.
Next Story