రాహుల్‌ గాంధీకి షాకిచ్చిన అభిమాని .. వీడియో వైరల్‌

రాహుల్‌ గాంధీకి షాకిచ్చిన అభిమాని .. వీడియో వైరల్‌
X

ఎవరైనా అభిమాన నాయకులు ఎదురైతే ఏం చేస్తాం. షేక్‌హ్యాండ్‌ లేదా ఓ హగ్ కానీ ఇస్తాం. అయితే రాహుల్‌ గాంధీకి ఓ అభిమాని నుంచి వింత అనుభవం ఎదురయ్యింది. రాహుల్ వయనాడ్‌ నియోజకవర్గ పర్యటనలో ఉండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎస్పీజీ లాంటి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే రాహుల్‌ గాంధీకి ఓ అభిమాని ముద్దు పెట్టాడు. వయనాడ్‌లో పర్యటిస్తున్న సమయంలో ఓ అభిమాని రాహుల్‌ వాహనం దగ్గరకు వచ్చి ముందుగా షేక్‌హ్యాండ్‌ ఇచ్చాడు. ఉన్నట్టుండి రాహుల్‌ చేయి పట్టుకుని లాగి బుగ్గపై ముద్దు పెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటనతో షాక్‌కు గురైన రాహుల్ తర్వాత తేరుకుని తన పర్యటనను కొనసాగించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలోనూ రాహుల్‌కి ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. గుజరాత్‌లో పర్యటించినప్పుడు ఓ మహిళ అతడిని ముద్దు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో అప్పుడు కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలైంది.

Next Story

RELATED STORIES