గడియారంలోని ముల్లు 12 మీదకు.. గౌతమ్‌ 13లోకి

గడియారంలోని ముల్లు 12 మీదకు.. గౌతమ్‌ 13లోకి
X

పుట్టినరోజు పిల్లలకు ఎంత సంతోషాన్నిస్తుందో అంతకంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది అమ్మానాన్నలకు. చూస్తుండగానే పిల్లలు పెరిగి పెద్దవాళ్లైపోతున్నారని ఆనందం. అదే ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది మహేష్ భార్య నమ్రత. తన కొడుకు 13వ ఏటలోకి అడుగు పెట్టి టీనేజర్ అయ్యాడంటూ సంతోషంగా శుభాకాంక్షలు అందించారు గౌతమ్‌కి. సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి గౌతమ్ పుట్టినరోజు నేడు. నమ్రత సోషల్ మీడియా వేదికగా గౌతమ్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నమ్రత.. గడియారంలోని ముల్లు 12 మీదకు రాగానే.. గౌతమ్ 13లోకి అడుగుపెట్టాడు అని ట్వీట్ చేశారు. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మహేశ్.. గౌతమ్‌కి ఇష్టమైన చాక్లెట్ తినిపించి ముద్దు పెట్టుకున్నారు. గౌతమ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం మహేష్.. రష్మిక మందనతో జోడీ కడుతూ అనిల్ రావిపుడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమా చేస్తున్నారు.

Next Story

RELATED STORIES