కుక్కకు నక్క లక్షణం.. అసలు విషయం తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే

కుక్కకు నక్క లక్షణం.. అసలు విషయం తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే

జిత్తులమారి ఎత్తుగడలు నక్కకు మాత్రమే ఉంటాయని.. అదే పోలికలతో ఉండే కుక్కకు మాత్రం విశ్వాసం ఉంటుందని ఇన్నాళ్ళు మనకు తెలిసిన విషయం. కానీ బ్యాంకాక్‌కు చెందిన ఒక కుక్క జిత్తులమారి గుంటనక్క లక్షణాలను నేర్చుకుంది. తిండికోసం అది వేసే నక్క వేషాలు చూసి అక్కడి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ విచిత్ర శునకానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. థాయ్‌ల్యాండ్‌లోని బ్యాంకాక్‌ నగర వీధుల్లో తిరిగే పూచ్.. ఓ శునకం పేరు. దాన్ని స్థానికులు ‘గే’ అని పిలుచుకుంటారు. అయితే దానికి సంబంధించిన ఓ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ వీడియోలో ‘గే’ తన ఎడమకాలు విరిగినట్లుగా నేలకు తాకుతు అతికష్టంగా నడుస్తోంది. అయితే అలా చూస్తే అయ్యో పాపం అని జాలి కలగవలసిందే. ఇంతకీ అలా ఎందుకు నడుస్తోందంటే వీధిలో నడుస్తున్న వ్యక్తుల సానుభూతి పొంది వారు వేసే ఆహారం కోసం ఇలాంటి వేషాలు వేస్తుంటుంది.

అయితే ఇలానే ఓ రోజు వీధుల్లో బైక్‌పై వెళుతున్న థావీపార్న్ చాంగ్ ప్లాపోల్కుల్ అనే వ్యక్తి ముందు తన నక్క తెలివిని చూపించింది ఈ కుక్క. దాన్ని చూసిన అతను దానికి నిజంగానే గాయమైందనుకుని దగ్గరకు వెళ్ళేందుకు ప్రయత్నించాడు. అతను రావడం చూసిన ఆ కుక్క మళ్ళీ యథాస్థితికి చేరుకుని అతని దగ్గరకు పరిగెత్తింది. దాని నటనకు అతను ఫూల్ అవ్వాల్సి వచ్చింది. దాని తెలివిని ముందుగానే పసి గట్టిన ఓ వ్యక్తి అది చేసే విన్యాసాన్ని వీడియో తీశాడు, దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాని తెలివిని చూసిన నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

Source:dailymail.co.uk

Tags

Read MoreRead Less
Next Story