సీఎం గారూ.. ఇలా చేస్తారా: హీరోయిన్

సీఎం గారూ.. ఇలా చేస్తారా: హీరోయిన్

సమస్యలపై స్పందించాలి.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి.. నాకెందుకులే అని అనుకోకుండా బాధ్యతగల ఓ భారతీయ పౌరురాలిగా ఏకంగా ముఖ్యమంత్రినే ప్రశ్నించింది కన్నడ హీరోయిన్ సోనూగౌడ. కొత్త మోటారు వాహనం చట్టం ద్వారా ప్రతి చిన్న తప్పుకీ భారీ జరిమానాలు విధిస్తూ జేబుకి చిల్లు పెడుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజల సంపాదనను జరిమానాల రూపంలో వసూలు చేయడం కాదు.. ముందు సరైన రోడ్లు వేసేలా చర్యలు తీసుకోండి. అప్పుడు రూల్స్ గురించి మాట్లాడొచ్చు.

ఎక్కడ చూసినా గుంతలు పడిన రోడ్లు.. కంట్రోల్ లేని ట్రాఫిక్. ముందు వాటిని నియంత్రిస్తే సగం యాక్సిడెంట్లు తగ్గిపోతాయి. అప్పుడు ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అని ముఖ్యమంత్రి యడియూరప్పను ట్విట్టర్ ద్వారా ప్రశ్నించింది. ఓ వాహనదారుడు రోడ్డుపై జారిపడుతున్న ఫోటోను తన ట్విట్టర్‌లో జత చేసిన సోనూగౌడ.. వాహన దారుడు సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే రూ.5 వేలు.. మద్యం తాగి డ్రైవ్ చేస్తే రూ.10 వేలు జరిమానా విధిస్తున్నారు. మరి రోడ్డు బాగోలేక వాహనదారుడు రోడ్డుపై పడితే ప్రభుత్వానికి ఎంత జరిమానా విధించాలి? అని ప్రశ్నిస్తోంది. సోనూ.. మీరు బాగా అడిగారు అంటూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story