మాయావతి కొత్త ట్విస్ట్

మాయావతి కొత్త ట్విస్ట్
X

త్వరలో హర్యానాలో జరిగే ఎన్నికల్లో సింగిల్ గానే బరిలోకి దిగుతానని అంటున్నారు బీఎస్సీ అధినేత్రి మాయవతి. అసెంబ్లీ ఎన్నికల్లో జన్నాయక్‌ జనతా పార్టీతో ఎలాంటి పొత్తు లేదని ట్విస్ట్ ఇచ్చారు. నెల రోజుల క్రితం పొడిచిన పొత్తు..ఎన్నికలకు నెల రోజుల ముందే విడిపోవటంతో హర్యానా రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఎస్పీ బాస్ ఎలక్షన్ స్ట్రాటజీ పూర్తిగా మారిపోయింది. యూపీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్పీ, ఆర్‌ఎల్‌డీ పార్టీలతో కలిసి లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దిగింది బీఎస్పీ. కానీ ఫలితాలు పూర్తిగా భిన్నంగా రావటంతో ఇక ఎన్నికల పొత్తులపై నమ్మకాన్ని చంపుకున్నారామె. ఇటీవల యూపీ ఉప ఎన్నికల్లో సింగిల్ గానే బరిలోకి దిగిన మాయవతి..హర్యానాలో అదే పొలిటికల్ స్ట్రాటజీతో జనంలోకి వెళ్తున్నారు.

హర్యానాలో గతేడాది.. ఇండియన్ నేషనల్ లోక్ దల్ నుంచి పుట్టిన జన్నాయక్‌ జనతా పార్టీతో మాయవతి పొత్తు ఖరారు చేసుకుంది. హర్యానాలోని 90 నియోజకవర్గాల్లో 40 సీట్లు బీఎస్పీ, 50 సీట్లు జేజేపీ పంచుకున్నాయి. కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బాంబు పేల్చారు మాయవతి. బీఎస్పీ హర్యానాలో ఒంటరిగానే పోటీ చేస్తుందని ఏ పార్టీతో పొత్తు లేదని ట్వీట్ చేశారు.

Next Story

RELATED STORIES