సెలబ్రిటీస్ బెడ్ టైమ్ స్టోరీస్‌తో బుల్లి తెరపై మంచు లక్ష్మి సందడి

సెలబ్రిటీస్ బెడ్ టైమ్ స్టోరీస్‌తో బుల్లి తెరపై మంచు లక్ష్మి సందడి

సెలబ్రిటీస్ అంటే చాలామంది ఇష్టపడతారు. సినిమాల్లోనో లేక టివీల్లోనో వాళ్లను చూసి అభిమానిస్తుంటారు. ముఖ్యంగా సినిమా స్టార్స్ అంటే చాలామందికి ఓ ఆరాధనాభావం కూడా ఉంటుంది. తమ అభిమాన నాయక/నాయకిలు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఏం చేస్తుంటారా అని ఆలోచిస్తుంటారు. మామూలుగా డే టైమ్ మేటర్స్ చాలా వరకూ తెలిసిపోతుంటాయి. కానీ సెలబ్రిటీస్ నైట్ లైఫ్ ఎలా ఉంటుంది. వాళ్లు బెడ్ పైకి చేరిన తర్వాత వాళ్ల ఆలోచనా విధానం ఎలా ఉంటుంది.

ఆ రోజంతా వారికి ఎలా గడిచింది.. ఇలాంటి అంశాలతో పాటు.. ఇప్పటి వరకూ ఎవరికీ చెప్పని, తెలియని విషయాలను కూడా తెలుసుకోవాలనుకునే అభిమానులు చాలా మందే ఉంటారు. వీటిని ‘బెడ్ టైమ్ స్టోరీస్’అనుకోవచ్చు. లేదా బెడ్ టైమ్ ఇంటర్వ్యూ అని కూడా అనుకోవచ్చు. సెలబ్రిటీస్ తో మాట్లాడుతూ.. ఆ టైమ్ లో వారి ఫీలింగ్స్ ను ఆడియన్స్ కు తెలిసేలా మంచు లక్ష్మి ఈ షోను మరింత క్రేజీగా హోస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉంది.

వయాకామ్ 18వాళ్లు నిర్వహిస్తోన్న ఈ షోకు హోస్ట్ గా చేసే అవకాశం వచ్చినందుకు మంచు లక్ష్మి చాలా ఎగ్జైటింగ్ గా ఫీలవుతున్నానని అన్నారు. ఈ షో ఫార్మాట్ చాలా యూనిక్ గా ఉంది. మన అభిమాన సెలబ్రిటీస్ ఫీలింగ్స్ ను, సీక్రెట్స్ ను తెలుసుకునేందుకు ఇది ఓ పర్ఫెక్ట్ సెట్టింగ్. సెలబ్రిటీస్ కు కూడా ఇదో ఇంట్రెస్టింగ్ ఎక్స్ పీరియన్స్‌గా మారబోతోంది. నేనూ ఈ షోకోసం చాలా వెయిట్ చేస్తున్నాను’’ అన్నారు. ఈ నెల 23 నుంచి ప్రారంభం కాబోతోందని వయాకామ్ 18 ప్రతినిధులు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story