దగ్గు రావడం మంచిదే.. ఎందుకో తెలుసా!!

దగ్గు రావడం మంచిదే.. ఎందుకో తెలుసా!!

వర్షాకాలం వస్తూనే జలుబు, దగ్గులను మోసుకు వస్తుంది. వాతావరణంలో మార్పులు, వర్షంలో తడవడం, ఇంట్లో ఒకరికి వస్తే మరొకరికి, ఇలా ఏదో విధంగా వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి దగ్గు జలుబులు. నిజానికి దగ్గు వస్తేనే మంచిది. మన ఊపిరితిత్తులకు రక్షణ లాంటిది. శ్వాస మార్గం ద్వారా ఏవైనా వ్యర్థ పదార్థాలు లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు వాటిని బయటికి పంపించేందుకు శరీరం చేసే బలమైన ప్రయత్నమే దగ్గు. అయితే దగ్గు రోజుల తరబడి వేధిస్తుంటే మాత్రం అశ్రద్ధ చేయకుండా డాక్టర్‌ని సంప్రదించాలి. దానికి గల కారణం తెలుసుకుని చికిత్స తీసుకోవాలి. దగ్గు మందులు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. అసలు సమస్య అలాగే ఉండిపోతుంది. కొన్ని చిట్కాలతో దగ్గు తగ్గించుకునే ప్రయత్నాలు చూద్దాం..

దగ్గుకు నీరు మంచి మందులా పని చేస్తుంది. నీళ్లు ఎక్కువగా తాగితే కఫం త్వరగా పల్చబడి బయటకు వెళ్లిపోతుంది.

ధనియాలు, మిరియాలు, అల్లం కషాయంగా చేసి తాగితే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

రాత్రి పడుకునే ముందు కప్పు గోరు వెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసుకుని తాగినా దగ్గు బాధించదు.

ఓ స్పూను వాము తిన్నా దగ్గు రాదు.

రాత్రి పడుకునే ముందు రెండు చెంచాల తేనె తాగితే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం కలుగుతుందని ఇజ్రాయెల్ అధ్యయనాల్లో తేలింది. విటమిన్ సి, ఫ్లావనాయిడ్ల నుండి ఉత్పత్తి అయిన యాంటీ ఆక్సిడెంట్లు తేనెలో దండిగా ఉంటాయి. శరీరంలో తీపిని నియంత్రించే నాడులకు దగ్గును నియంత్రించే నాడులకు దగ్గరి సంబంధం ఉండడంవల్ల తేనెలోని తియ్యదనం దగ్గును తగ్గించేందుకు తోడ్పడుతుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

అల్లం రసంలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు, ఆయాసం, జలుబు, కఫం తగ్గుతుంది.

ఒక కప్పు గోరువెచ్చని నీటిలో సగం టీ స్పూన్ పసుపు, సగం టీ స్పూన్ ఉప్పు కలిపి ఆ నీటితో పుక్కిలించి ఉమ్మేస్తే దగ్గు తగ్గుతుంది.

Tags

Read MoreRead Less
Next Story