తాజా వార్తలు

పొలానికి వేసిన విద్యుత్‌ తీగలు తగిలి గర్భిణి మృతి

పొలానికి వేసిన విద్యుత్‌ తీగలు తగిలి గర్భిణి మృతి
X

పొలానికి రక్షణ కోసం వేసిన కరెంట్‌ తీగ తగిలి ఓ గర్భిణి ప్రాణాలు విడిచింది. కొన్ని నెలలైతే ఈ లోకాన్ని చూడాల్సిన పసికందు కూడా తల్లికడుపులో మృతి చెందింది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా మామడ మండలం కిషన్‌రావ్‌పేటలో చోటు చేసుకుంది.

లావణ్య అనే గర్భిణి బావి వద్దకు వెళ్లి వస్తుండగా విద్యుత్‌ ప్రమాదానికి గురైంది. అడవిపందుల నుంచి పొలానికి రక్షణ కోసం ఓ రైతు పంట చుట్టు విద్యుత్ తీగలను అమర్చాడు. గర్భిణీ విద్యుత్‌ తీగను గమనించకపోవడం.. అదే సమయంలో తీగకు విద్యుత్‌ ప్రసారం కావడం ప్రమాదానికి కారణమైంది. దురదృష్టవశాత్తు కరెంట్‌ షాక్ తగిలి గర్భిణీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. గర్భిణీతో పాటు గర్భంలో ఉన్న శిశివు కూడా మృతి చెందింది. ఈ ఘటన ఆ గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. అందరినీ కలిచివేసింది.

Also watch :

Next Story

RELATED STORIES