తాజా వార్తలు

హుజుర్ నగర్ ఉపఎన్నికల్లో టీడీపీ పోటీ

హుజుర్ నగర్ ఉపఎన్నికల్లో టీడీపీ పోటీ
X

హుజుర్ నగర్ ఉపఎన్నికల్లో టీడీపీ కూడా పోటీ చేస్తోంది. ఆదివారం తమ అభ్యర్థిని ప్రకటిస్తున్నట్టు టీడీపీ ప్రకటించింది. పొత్తులో భాగంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డికి టీడీపీ మద్దతు ఇచ్చింది. అయితే ఈసారి ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకుంది అధిష్టానం. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో తెలంగాణ సీనియర్ నేతలు భేటీ అయిన తరువాత ఈ నిర్ణయం వెలువడింది. మరోవైపు టికెట్ కోసం చాలామంది నేతలు క్యూ కట్టినట్టు తెలుస్తోంది. అధికార తెరాస నుంచి శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ పద్మావతిరెడ్డి, బీజేపీ నుంచి కోటా రామారావు బరిలోకి దిగుతుండగా.. తాజాగా టీడీపీ కూడా పోటీ చేస్తున్నట్టు ప్రకటించడంతో ఉప పోరు రసవత్తరంగా మారనుంది.

Next Story

RELATED STORIES