జైలు నుంచి విడుదలైన డీకే.. బెంగళూరు ఎందుకు రావడం లేదు?

జైలు నుంచి విడుదలైన డీకే.. బెంగళూరు ఎందుకు రావడం లేదు?
X

dk-shivakumar

తీహార్ జైలు నుంచి విడుదలైన కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ ఇంకా ఎందుకు బెంగళూరు రావడం లేదు..? సొంత ఇంటికి రావడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు..? జ్యోతిష్యులు వద్దన్నారా..? ప్రస్తుతం డీకే ఎక్కడికి వెళ్లినా చేతిలో నిమ్మకాయ ఎందుకు ఉంచుకుంటున్నారు..? ఇప్పుడు దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జైలు నుంచి విడుదలయ్యాక ఆయన జ్యోతిష్యాన్ని మరింతగా నమ్ముతున్నట్టు కనిపిస్తోంది. కొన్ని శాంతిపూజలు చేయించినట్టు కూడా వార్తలొస్తున్నాయి.

ప్రముఖ జ్యోతిష్యుని సలహా మేరకు దీపావళి కంటే ఒకరోజు ముందు శనివారం డీకే బెంగళూరుకు వస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న DKను కలవడానికి శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఆయన నివాసానికి వెళ్లారు. సుమారు గంటకుపైగా వారితో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది.

Next Story

RELATED STORIES