దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠా గుట్టు రట్టు

దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠా గుట్టు రట్టు
X

police

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠా గుట్టు రట్టు అయింది. పోలీసుల తనిఖీలో నకిలీగాళ్ల బండారం బయటపడింది. పట్టణంలోని రాజీవ్‌నగర్‌ కాలనీలో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే గౌరిగూడెం గ్రామంలోని పాత నేరస్థుడు మధార్ ఇంటి వద్ద సుమారు 40లక్షల నకిలీ కరెన్సీ కట్టలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

దొంగనోట్ల ముద్రణ కేసులో మొత్తం ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు మాధార్‌ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు కోసం గాలింపు చేపట్టారు.

Next Story

RELATED STORIES