ప్రియాంకరెడ్డి హత్య కేసులో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీసులపై వేటు

ప్రియాంకరెడ్డి హత్య కేసులో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీసులపై వేటు

priyanka-reddy-phone-call

ప్రియాంకరెడ్డి హత్యకేసు రిమాండ్‌ రిపోర్టులో సంచలన అంశాలు వెలుగుచూశాయి. నిర్భయ ఘటన తరహాలో ప్రియాంకరెడ్డిని పాశవికంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. ప్రియాంకపై రాత్రి 9:30 నుంచి 10:20 వరకు అఘాయిత్యానికి ఒడిగట్టారు నిందితులు. అత్యాచారానికి ఒడిగట్టే సమయంలో అత్యంత క్రూరంగా ప్రవర్తించారు నిందితులు. ప్లీజ్‌ వదిలేయండి అని వేడుకున్నా కనికరించలేదు.. ఆమెతో బలవంతంగా మద్యం తాగించారు. ఆపై ఒకరి తర్వాత మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు అరుస్తుండటంతో గట్టిగా ముక్కు, నోరు మూసేశారు. దీంతో ఊపిరాడక ఆమె అపస్మారస్థితిలోకి వెళ్లింది. ఆ తర్వాత ప్యాంట్ లేకుండానే లారీ క్యాబిన్‌లోకి ఎక్కించారు. ఆ తర్వాత ఈ మృగాళ్లు ఆగలేదు.. లారీలో ప్రియాంక మృతదేహంపైనా అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరి తర్వాత మరొకరు రేప్ చేశారు. ప్రియాంక డెడ్‌బాడీని కిందకు దించే సమయంలో.. బతికే ఉందన్న అనుమానంతో పెట్రోల్ పోసి కాల్చిచంపారు నిందితులు.. లారీలో ప్రియాంక రక్తం మరకలు, వెంట్రుకలు, సేకరించింది ఫోరెన్సిక్‌ బృందం.

మరోవైపు ప్రియాంక కేసులో నిందితులను పట్టుకునేందుకు ఫోన్ నెంబర్ కూడా కీలకంగా మారింది. ప్రధాన నిందితుడు మహ్మద్ పాషా ప్రియాంక ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. బండి పంక్చర్ వేయిస్తామంటూ తీసుకెళ్లిన శివ ఎంతకూ రాకపోవడంతో పాషాకు కాల్‌ చేసింది ప్రియాంక. ఈ నెంబర్ ఆధారంగానే పోలీసులు పాషా ఆచూకీని కనిపెట్టారు.

నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లపై నలుగురు రాక్షసులు సాగించిన దాష్టీకాన్ని తలుచుకుంటే రక్తం మరిగిపోతోందని జనం ఆగ్రహంతో ఊగిపోయారు. అరెస్టులు బెయిళ్ల బదులు వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు.

పెల్లుబికిన ప్రజాగ్రహంతో ప్రియాంకరెడ్డి హత్య కేసులో నిందితులను కోర్టుకు తీసుకెళ్లే సాహసం చేయలేకపోయారు పోలీసులు. బయటకు తీసుకొస్తే మూకదాడి జరిగే ప్రమాదం ఉండడంతో.. చాలా అప్రమత్తంగా వ్యవహరించారు. షాద్‌నగర్‌ మేజిస్ట్రేట్ అందుబాటులో లేకపోవడంతో తహసీల్దార్ ముందు నిందితుల్ని ప్రవేశపెట్టారు. స్టేషన్ వద్దకు భారీగా జనం తరలిరావడం.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. తహసీల్దార్‌ పాండునాయకే స్టేషన్‌కు వచ్చారు. నిందితులకు 7 రోజుల రిమాండ్ విధించారు. ఉద్రిక్తతల మధ్యే నిందితుల్ని చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే అక్కడ కూడా పోలీసులకు ప్రతిఘటన తప్పలేదు. నిందితుల్ని అప్పగించాలంటూ స్థానికులు పెద్ద ఎత్తున చర్లపల్లి జైలుకు తరలివచ్చారు. నిందితుల్ని తీసుకొస్తున్న వెహికిల్స్‌పై చెప్పులు, రాళ్లు విసిరి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. చివరకు పోలీసులు ఆందోళనకారులపై స్వల్ప లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టాల్సి వచ్చింది. పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీసులపై వేటు పడింది. శంషాబాద్‌ ఎస్సై రవికుమార్‌, హెడ్‌కానిస్టేబుళ్లు వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్‌ను సీపీ సజ్జనార్‌ సస్పెండ్‌ చేశారు. ఫిర్యాదు స్వీకరణలో నిర్లక్ష్యం వహించినందుకు పోలీసులపై సీపీ చర్యలు తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story