టాలీవుడ్ హీరో అరెస్ట్

టాలీవుడ్ హీరో అరెస్ట్

rapist

ఎవడ్రా హీరో అనే చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బషీద్‌ను అరెస్ట్‌ చేశారు పోలీసులు. రుణాలు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో ఆయన్ను హైదరాబాద్‌ వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. చిన్నచిన్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు గ్యారెంటర్‌గా ఉండి ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తానంటూ.. డబ్బులు వసూలు చేసినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. ఒక్కొక్కరి వద్ద 30 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దుబాయ్‌లోని ఏస్‌బీకే గ్రూప్‌ పేరుతో బషీద్‌ నకిలీ వ్యాపారం చేసినట్లు గుర్తించారు. దుబాయ్‌ ఎంబసీ ఫిర్యాదుతో అతన్ని అరెస్ట్‌ చేశారు పోలీసులు.

46 ఏళ్ల బషీద్‌.. గుంటూరు వేజెండ్ల ప్రాంతానికి చెందినవాడు. బీకాం చదివిన బషీద్‌ తొలుత గుంటూరులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవాడు. 2008లో హైదరాబాద్‌ వచ్చి ఎస్‌బీకే గ్రూప్‌ పేరుతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం, ముంబై, చెన్నై, బెంగళూరు, దుబాయ్‌లలో ఫైనాన్స్‌ సంస్థలను ప్రారంభించాడు. కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన పానకాలరావు అనే వ్యక్తి 15 కోట్ల రూపాయలు రుణం కావాలని ఆశ్రయించగా.. అతడి నుంచి బషీద్‌ రూ.65 లక్షలు వసూలు చేశాడు. గుంటూరుకు చెందిన మువ్వా గురవయ్య అనే మరో వ్యక్తి 10 కోట్ల రూపాయల రుణం కావాలని సంప్రదించగా అతని వద్ద నుంచి రూ.33 లక్షలు వసూలు చేశాడు. రుణం మంజూరుపై అడిగిన వీరిద్దరినీ బషీద్‌ బెదిరించినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story