ఆంధ్రప్రదేశ్

కదిరిలో టీడీపీ నేత కందికుంట ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం

కదిరిలో టీడీపీ నేత కందికుంట ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం
X

kandikunta-venkata-prasad

అనంతపురం జిల్లా కదిరిలో టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్‌ కందికుంట వెంకట ప్రసాద్‌ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. టీడీపీతో పాటు జనసేన, సీపీఐ సహా వివిధ పక్షాల నాయకులు హాజరయ్యారు. రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉండాలని ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారు. అప్పుల రాష్ట్రంగా అవతరించిన ఆంధ్రప్రదేశ్‌.. అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే అందుకు అన్ని విధాలుగా అనుకూలమైన రాజధాని ముఖ్యమని టీడీపీ నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్‌ అన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామంటు వైసీపీ ప్రభుత్వం చెప్పడం తుగ్లక్ చర్యగా విమర్శించారు. రాష్ట్రానికి ఓ మూలగా ఉన్న చోట రాజధాని పెడతామంటే ప్రజాస్వామ్య పద్ధతిలో సమాధానం చెప్తామని ప్రసాద్‌ హెచ్చరించారు.

Next Story

RELATED STORIES