Top

జనవరి 8న భారత్‌బంద్‌.. యూపీలో హైఅలెర్ట్..

జనవరి 8న భారత్‌బంద్‌.. యూపీలో హైఅలెర్ట్..
X

bandh

సమస్యల పరిష్కారం కోరుతూ బ్యాంకులు, వ్యాపార సంఘాలు భారత్‌బంద్‌కు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందంటూ 10 ట్రేడ్ యూనియన్లు దేశవ్యాప్త సమ్మెకు దిగుతున్నాయి. INTUC, AITUC, HMS, CITU తదితర కార్మిక సంఘాలు ఈ బంద్‌లో పాల్గొంటున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 25 కోట్ల మంది ఒక్కరోజు సమ్మెలో పాల్గొంటారని అంచనా. కార్మిక చట్టాల సవరణ సహా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. పారిశ్రామికవేత్తలు, కంపెనీలకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవరిస్తోందని కార్మిక సంఘాల నేతలు దుయ్యబట్టారు.

ట్రేడ్ యూనియన్ల సమ్మెకు విద్యార్థి సంఘాలు కూడా మద్దతు పలికాయి. దేశవ్యాప్తంగా 60 విద్యార్థి సంఘాలు బంద్‌కు మద్ధతిస్తూ ప్రకటన విడుదల చేశాయి. రైతు సంఘాలు కూడా బంద్‌కు సంఘీభావం ప్రకటించాయి. మోదీ సర్కారు ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డాయి. 12 ఎయిర్‌పోర్టులను ఇప్పటికే అమ్మేశారని, ఎయిర్‌ ఇండియాను ప్రైవేటీకరణ చేయడానికి నిర్ణయం తీసుకున్నారని కార్మిక సంఘాలు దుయ్యబట్టాయి. రైల్వేలలోనూ ప్రైవేటీకరణ మొదలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశా రు. బీపీసీఎల్‌ను కూడా అమ్మేస్తున్నారని, ఇలా ఒక్కొక్కటిగా ప్రభుత్వ రంగ సంస్థలను వదిలించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులు, కార్మికులు, విద్యార్థి సంఘాల తరపున జనవరి 8న బారత్ బంద్‌ జరుగుతున్నదంటూ సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని డిజీపీ కార్యాలయం రాష్ట్రవ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించింది. దీంతో అన్ని జిల్లాలలోనూ పోలీసు బందోబస్తు ముమ్మరం చేశారు. మరోవైపు నేషనల్ ట్రేడ్ యూనియన్ జనవరి 8న ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ రెండు రోజుల ఆందోళన కార్యక్రమానికి పలు బ్యాంకు యూనియన్లతో పాటు రైతు సంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ బంద్ విజయవంతం చేయాలని కోరుతూ పలువురు పోస్టులు పెడుతున్నారు.

Next Story

RELATED STORIES