వరంగల్‌ జిల్లాలో దారుణం.. అనుమానంతో ప్రియురాలి గొంతుకోసిన ప్రేమోన్మాది

వరంగల్‌ జిల్లాలో దారుణం.. అనుమానంతో ప్రియురాలి  గొంతుకోసిన ప్రేమోన్మాది
X

lover-attack

వరంగల్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమోన్మాది పైశాచికత్వానికి మరో యువతి బలైంది. హన్మకొండలోని రామ్‌ నగర్‌లో ప్రేమోన్మాది సాహిద్‌.. యువతి గొంతు కోసి చంపేశాడు. అతిదారుణంగా కత్తితో గొంతు కోయడయంతో యువతి హరిత అక్కడికక్కడ మృతి చెందింది. అనంతరం నిందితుడు జడ్జి ముందు లొంగిపోయాడు. న్యాయమూర్తి ఆ నిందితుడిని పోలీసులకు అప్పగించారు.

ఐతే ప్రమోన్మాది సాహిద్‌కు, యువతి హరితకు ఇంతకుముందే పరిచయం ఉన్నట్టు తెలుస్తుంది. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహరం నడుస్తోంది. ప్రియురాలు హరితపై అనుమానం పెంచుకున్న..సాహిద్‌ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. రామ్‌నగర్‌లో నివాసం ఉంటున్న తన రూమ్‌కి యవతిని తీసుకెళ్లాడు. అనంతరం అతి దారుణంగా గొంతు కోసి చంపేశాడు. నిందితుడి సాహిద్‌ను సుభేదారి పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Next Story

RELATED STORIES