తాజా వార్తలు

హైదరాబాద్ లో మరో దారుణం.. మద్యం తాగించి యువతిపై అత్యాచారం

హైదరాబాద్ లో మరో దారుణం.. మద్యం తాగించి యువతిపై అత్యాచారం
X

rape

హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. జూబ్లిహిల్స్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఓ మోడలపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. మద్యం తాగించి అఘాయిత్యానికి తెగబడ్డారు. ఈ ఘాతుకాన్ని నిందితులు ఫోన్లో చిత్రీకరించారు. ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 28న ఈ దురాగతం జరిగింది.

జనవరి 7న ఫిర్యాదు చేసినా జూబ్లీహిల్స్ పోలీసులు పట్టించుకోలేదని బాధితురాలు వాపోయింది. కేసును నీరు కారుస్తున్నారని ఆరోపించింది. అయితే యువతిపై అత్యాచారం చేసిన ఇద్దరు యువకులపై కేసు నమోదు చేశామని బంజారాహిల్స్‌ ఏసీపీ తెలిపారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పేర్కొన్నారు.

Next Story

RELATED STORIES