మహరాజుగా మాధవన్.. మహరాణిగా సమంత.. ఈ కొత్త గెటప్ ఏ సినిమా కోసమో..

మహరాజుగా మాధవన్.. మహరాణిగా సమంత.. ఈ కొత్త గెటప్ ఏ సినిమా కోసమో..
X

samantha,-madhavan

ఓ బేబీగా ప్రేక్షకులను మైమరపించిన సమంత మహరాణిలా మరొకసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబోతోందా.. తన పాత్రల ఎంపికలో ఆచి తూచి అడుగేస్తూ.. వచ్చిన పాత్రలకు వంద శాతం న్యాయం చేస్తోంది. నటనలో జీవిస్తోంది.. మంచి మార్కులను కొట్టేస్తుంది. ఒక్క సినిమాల్లోనే కాదు ఈ మధ్య వెబ్ సిరీస్‌లోనూ, అడపా దడపా వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తూ బిజిగా ఉంటోంది శామ్.

తాజాగా సమంత, మాధవన్ కలిసి నటించిన కాఫీ యాడ్ వైరల్ అవుతోంది. ఇందులో మాధవన్ మహరాజులా సమంత మహరాణిలా కనిపిస్తున్నారు. ఇది ఓ తమిళ యాడ్. త్వరలో ఈ ప్రకటన టీవీల్లో రానుందని కాఫీ బ్రాండ్ యాజమాన్యం తెలిపింది. ప్రస్తుతం సమంత తమిళ రీమేక్ 96లో నటిస్తోంది. ఇందులో శర్వానంద్ కధానాయకుడు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.

Next Story

RELATED STORIES