భారీ క్రేజ్ తో వస్తోన్న అశ్వథ్థామ

భారీ క్రేజ్ తో వస్తోన్న అశ్వథ్థామ
X

యంగ్ అండ్ హ్యాండ్సమ్ స్టార్ నాగశౌర్య నటించిన సినిమా అశ్వథ్థామ. ఓ యూనిక్ సబ్జెక్ట్ తో వస్తోన్న ఈ మూవీకి కథ అందించింది శౌర్యనే కావడం విశేషం. మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించిన అశ్వత్థామతో రమణతేజ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. శౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో రూపొందిన ఈ సినిమాకు భారీ క్రేజ్ వచ్చింది. మూవీ టైటిల్ కే మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే టీజర్, ట్రైలర్ తో ఒక్కసారిగా అంచనాలు పెంచింది టీమ్. అటు పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయనే టాక్ రావడంతో విడులకు ముందే అశ్వత్థామకు హిట్ కళ కనిపిస్తోంది.

నాగశౌర్య ఫస్ట్ టైమ్ మాస్ అండ్ రగ్డ్ డ్ లుక్ లో ఆకట్టుకునేలా కనిపిస్తున్నాడు. ట్రైలర్ చూస్తే మాస్ మూవీలా అనిపిస్తోన్నా అంతకు మించిన బలమైన కంటెంట్ ఉన్న సినిమా ఇది అని చెబుతున్నారు. కాంటెంపరరీ ఇష్యూస్ ను టచ్ చేస్తూనే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా రూపొందిన ఈచిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుందంటున్నారు. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను ఖచ్చితంగా చూడాలని ఇండస్ట్రీలోని చాలామంది పెద్దలు కూడా మాట్లాడుకుంటుండటం విశేషం. నాగశౌర్య తన ఇమేజ్ కు భిన్నంగా ఈ అద్భుతమైన కథ రాసుకుని ఆడియన్స్ కు ముందుకు వస్తుండటంపై చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీతో శౌర్యలో ఎంత మంచి కథకుడు ఉన్నాడనేది కూడా పరిశ్రమకు తెలుస్తుంది. మొత్తంగా ఆడియన్స్ ను ఈ మూవీపై అటెన్షన్ వచ్చేలా చేయడంలో ఇప్పటికే సూపర్ సక్సెస్ అయింది టీమ్. ఇక పెద్దగా పోటీ కూడా లేకపోవడం వల్ల అశ్వత్థామ బాక్సాఫీస్ బరిలో సూపర్ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. మరి ఈ మూవీతో నాగశౌర్య ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అందుకుంటాడో చూడాలి.

Next Story

RELATED STORIES