బడ్జెట్‌ను ఆకాశానికెత్తిన కేంద్ర పెద్దలు.. ప్రజలకు ఒరిగిందేమి లేదంటున్న విపక్షాలు

బడ్జెట్‌ను ఆకాశానికెత్తిన కేంద్ర పెద్దలు.. ప్రజలకు ఒరిగిందేమి లేదంటున్న విపక్షాలు

ఆధునిక భారత నిర్మాణానికి కావాల్సిన నైపుణ్యాలపై దృష్టిపెట్టినట్టు.. ప్రధాని మోదీ తెలిపారు. బడ్జెట్‌లో అన్ని రంగాలకు న్యాయం జరిగిందన్నారు మోదీ. నీలి విప్లవంతో మత్స్య పరిశ్రమలో విస్తృత అవకాశాలున్నాయన్నారు. దేశ ఆరోగ్య రంగానికి ఆయుష్మాన్‌ భారత్‌ కొత్త దశను నిర్దేశిస్తుందన్నారు. మధ్యతరగతి , కార్పొరేట్ రంగానికి అనుకూల బడ్జెట్ అన్నారు.

కేవలం మాటలకు మాత్రమే పరిమితమైన బడ్జెట్ అన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. దేశాన్ని పట్టిపీడీస్తున్న నిరుద్యోగ సమస్యను పట్టించుకోలేదని అన్నారు. ఉద్యోగ కల్పనకు తీసుకోవాల్సిన చర్యల్ని బడ్జెట్ లో ప్రస్తావించకపోవడం దురదృష్టకరమన్నారు.

మధ్య తరగతి ప్రజలకు కాస్త టాక్స్ బెనిఫిట్ తప్ప.. ఈ బడ్జెట్ తో ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదన్నా కాంగ్రెస్ నేత శశిథరూర్‌. ఈ బడ్జెట్ తో దేశం స్టాండింగ్ ఇండియా నుంచి సిట్ డౌన్ ఇండియా వైపు వెళ్తున్నట్టుగా అనిపిస్తోందన్నారు.

బడ్జెట్ పై కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ హర్షం వ్యక్తం చేశారు. ఇది చేతల బడ్జెట్ అని కొనియాడారు. ఫార్మింగ్ అండ్ ట్రాన్స్ ఫార్మింగ్ బడ్జెట్ అని అన్నారు. ఇది అన్నివర్గాల ప్రజలకు అనుకూల బడ్జెట్ అన్నారు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు. ఇదొక పరిపూర్ణ బడ్జెట్ అన్నారు. టాక్స్ రిలాక్సేషన్ గొప్ప నిర్ణయమని కొనియాడారు.

ఇది ఎగుమతుల ప్రోత్సాహకర బడ్జెట్ అన్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. ఈ బడ్జెట్ తో ఫర్నిచర్ ఇండస్ట్రీ పరిధి పెరుగుతుందని అన్నారు. వ్యవసాయం దాని అనుబంధ రంగాలు వృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

కేంద్ర బడ్జెట్ అర్థవంతమైన ఆర్థిక వ్యవస్థకు బాటలు పరిచేలా వుందన్నారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఈ బడ్జెట్ తో ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అద్భుతమైన బడ్జెట్ ను ప్రవేశపెట్టినందుకు ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు యోగి కృతజ్ఞతలు తెలిపారు.

కేంద్ర బడ్జెట్ జౌళి పరిశ్రమకు ఎంతో ఉపయుక్తంగా వుందన్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. మహిళలు, చిన్నారుల పౌష్టికాహారంపై దృష్టిపెట్టడం ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. ఆదాయపు పన్నుకొత్త శ్లాబ్‌లంటూ మాయ చేశారని... విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.. ఊరించి.. నిరుత్సాహ పరిచారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story