క్రైమ్

దారుణం.. ఏడుగురు రైతులపై దాడి

దారుణం.. ఏడుగురు రైతులపై దాడి
X

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. మానవత్వం మరిచిపోయి పశువుల్లా ప్రవర్తించారు. అనాగరికంగా వ్యవహరిస్తూ కర్రలు, రాళ్లతో దాడి చేశారు. కిందపడేసి చితకబాదారు. కర్రలతో ఇష్టం వచ్చినట్లు కొట్టారు. కసిదీరా రాళ్లు విసిరి ప్రాణాలు తీయడానికి ప్రయత్నించారు.

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా మాన్వర్‌ ఏరియాలో ఏడుగురు రైతులపై దాడి జరిగింది. చిన్నపిల్లలను ఎత్తుకుపోవడానికి వచ్చారనే అనుమానంతో గ్రామస్థులు వారిపై దాడి చేశారు. రైతులు చెప్పేది కూడా వినిపించుకోకుండా దారుణంగా కొట్టారు. వందలమంది గ్రామస్థులు చుట్టుముట్టి రైతులకు నరకం చూపించారు. వారి వాహనాలను కూడా తగులబెట్టారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

Next Story

RELATED STORIES