వైసీపీలో భగ్గుమన్న వర్గ పోరు.. తారస్థాయికి చేరిన నేతల మధ్య మాటల యుద్ధం

వైసీపీలో భగ్గుమన్న వర్గ పోరు.. తారస్థాయికి చేరిన నేతల మధ్య మాటల యుద్ధం

అనంతపురం జిల్లా వైసీపీలో వర్గ పోరు భగ్గమంటోంది. ముఖ్యంగా హిందూపురం వైసీపీలో వర్గవిభేదాలు తారాస్థాయికి చేరాయి. శుక్రవారం ఎమ్మెల్సీ ఇక్బాల్‌ అహ్మద్‌, వైసీపీ హిందూపురం పార్లమెంట్‌ ఇంఛార్జ్‌ నవీన్‌నిశ్చల్‌ పోటాపోటీగా సమావేశాలు నిర్వహించారు. ఓ ఫంక్షన్‌హాల్‌లో నవీన్‌నిశ్చల్‌తో పాటు వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొటిపి హనుమంతరెడ్డి, మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఇక్బాల్‌పై నవీన్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఇక్బాల్‌ వైసీపీకి పట్టిన కరోనా అంటూ వ్యాఖ్యానించారు.

అదే సమయంలోఎమ్మెల్సీ ఇక్బాల్‌ అహ్మద్‌ మరో సమావేశం నిర్వహించి నవీన్‌ నిశ్చల్‌ వ్యాఖ్యలపై మండిపడ్డారు. నవీన్‌ అసమర్థుడు కాబట్టే ముఖ్యమంత్రి జగన్‌ తనను హిందూపురానికి పంపారన్నారు. గత ఎన్నికల్లో నవీన్‌నిశ్చల్‌ ద్రోహం చేయడం కారణంగా తాను ఓడిపోవాల్సి వచ్చిందన్నారు. ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నవీన్‌ చిల్లర రాజకీయాలు మానుకొవాలని సూచించారు. పార్టీకి ద్రోహం చేసే వారిని సస్పెండ్‌ చేయాలని అధిష్టానాన్ని గట్టిగా కోరతానన్నారు. ఇలా ఇరువర్గాలు పోటాపోటీగా సమావేశాలు నిర్వహించడంతో హిందుపురం వైసీపీలో రాజకీయ వర్గపోరు వేడెక్కింది.

Tags

Read MoreRead Less
Next Story