ఫిట్స్ రావటంతో పడిపోయిన డ్రైవర్.. బీభత్సం స‌ృష్టించిన ట్రాక్టర్

ఫిట్స్ రావటంతో పడిపోయిన  డ్రైవర్.. బీభత్సం స‌ృష్టించిన ట్రాక్టర్

హైదరాబాద్ చైతన్యపురిలో ఓ ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో ట్రాక్టర్‌పై నుంచి కిందపడిపోయాడు. దీంతో వాహనం ఒక్కసారిగా అదుపుతప్పింది. వేగంగా ముందుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో రోడ్డుపైనున్న వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. రెండు కార్లు, మరో ఐదు బైకులు పూర్తిగా దెబ్బతిన్నాయి.

అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరీ ప్రాణనష్టం సంభవించలేదు. ఘటన జరిగిన సమయంలో అక్కడే రోడ్డుపై ఓ చిన్నారి ఆడుకుంటోంది. అయితే ట్రాక్టర్‌ దూసుకురావడాన్ని గమనించిన ఆ పాప ఒక్కసారిగా ఇంట్లోకి పరుగెత్తింది. లేదంటే ఆ చిన్నారిపైకి ట్రాక్టర్ దూసుకెళ్లేది. గాయపడిన డ్రైవర్‌కు ప్రథమ చికిత్స అందించి.. ఆస్పత్రికి తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story