Top

వైసీపీ నేతల అరాచకం.. నీ అంతుచూస్తామంటూ బిల్డర్‌కు బెదిరింపులు

ఏపీలో వైసీపీ నేతల అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తాజాగా.. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో వైసీపీ నేత అనుచరులు రెచ్చిపోయారు. అగ్రిమెంట్‌ కన్నా తక్కువ ధరకు బిల్డింగ్ అప్పగించాలని బిల్డర్‌ నాగేంద్రబాబుకు వైసీపీ నేత అనుచరుల ముఠా ఫోన్‌లో వార్నింగ్‌ ఇచ్చారు. తాము చెప్పినట్టు వినకపోతే అంతుచూస్తామని హెచ్చరించారు.

వైసీపీ నేతల హెచ్చరికపై.. బిల్డర్‌ నాగేంద్రబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. పోలీసులు కూడా స్పందించడంలేదని బిల్డర్‌ అంటున్నారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని తెలిపారు. న్యాయపరంగా వెళ్లినా చంపేస్తామని వైసీపీ నేత అనుచరులు హెచ్చరించినట్టు... ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story

RELATED STORIES