స్థానిక రిజర్వేషన్లపై రాష్ట్రప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని టీడీపీ డిమాండ్

స్థానిక రిజర్వేషన్లపై రాష్ట్రప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని టీడీపీ డిమాండ్

స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకి వెళ్లాల్సిందేనని TDP డిమాండ్ చేస్తోంది. రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని చెప్పిన హైకోర్టు.. 59.85 శాతం ఇవ్వడం కుదరదంటూ జీవో 176ను కొట్టివేయడంతో దీనిపై సుప్రీంకి వెళ్లాలని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వానికి BCల రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే తక్షణం మంచి లాయర్‌ను నియమించాలన్నారు. అమరావతి రైతులకు అన్యాయం చేసేందుకు 5 కోట్లు పెట్టి అడ్వొకేట్‌ను పెట్టిన ప్రభుత్వం.. రిజర్వేషన్ల అమలుపై ఎందుకు ఆ రకంగా చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. సుప్రీంలో ప్రభుత్వం కేసు వేస్తే తాము కూడా ఇంప్లీడ్ అవుతామన్నారు. అటు, రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు వేసిన ప్రతాప్‌రెడ్డి ఏ పార్టీకి చెందిన వ్యక్తి అనే దానిపైనా TDP, YCPల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ వ్యక్తి తెలుగుదేశం నేతలకు సన్నిహితుడేనంటూ బొత్స ఫొటోలు రిలీజ్ చేస్తే.. దానికి కౌంటర్‌గా TDP కూడా ఫొటోలు రిలీజ్ చేసింది. జగన్‌తో ప్రతాప్‌రెడ్డి సన్నిహితంగా ఉన్న ఫొటోలను అచ్చెన్నాయుడు బయటపెట్టారు. రిజర్వేషన్లపై రెడ్డి సంఘంతోనే కేసు వేయించిన జగన్‌రెడ్డి బీసీల ద్రోహి అని విమర్శించారు.

అటు, స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నామన్నారు బిరు ప్రతాప్‌రెడ్డి. ఓసీలకు అన్యాయం జరిగేలా జీవో 176 ఉందని అందుకే 59.85 శాతం రిజర్వేషన్‌లు వద్దంటూ కోర్టుకు వెళ్లానని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story