బిగ్‌ బాస్‌ -3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై బీరు సీసాలతో దాడి

బిగ్‌ బాస్‌ -3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై బీరు సీసాలతో దాడి
X

బిగ్‌బాస్‌-3 విజేత, గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌పై హైదరాబాద్‌లోని ఓ పబ్బులో దాడి జరిగింది. తలపై బీరుసీసాలతో కొట్టడంతో తీవ్ర రక్త స్రావమైంది. గచ్చిబౌలిలోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాహుల్ సిప్లిగంజ్‌ తన స్నేహితులు, ఓ స్నేహితురాలితో కలసి గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు బుధవారం రాత్రి వచ్చాడు. కొంతమంది యువకులు .. రాహుల్‌ వెంట వచ్చిన యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. రాహుల్‌ వారిని నిలదీయడంతో.. మాటామాట పెరిగింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఈ దాడిలో.. రాహుల్‌ను బీర్‌ సీసాలతో కొట్టారు యువకులు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. వివరాలు సేకరించారు. దాడికి పాల్పడినవారిలో వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story

RELATED STORIES