ఆ వ్యక్తి చనిపోయాడు.. తెలంగాణ ప్రభుత్వానికి కర్ణాటక ఆరోగ్యశాఖ సమాచారం

ఆ వ్యక్తి చనిపోయాడు.. తెలంగాణ ప్రభుత్వానికి కర్ణాటక ఆరోగ్యశాఖ సమాచారం
X

భారత్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. బుధవారం కర్ణాటకలోని కల్బుర్గిలో చనిపోయిన 76 ఏళ్ల వృద్ధుడు మహమ్మద్‌ హుస్సేన్‌ సిద్ధిఖీ.. కరోనా వైరస్‌తో చనిపోయినట్లు నిర్ధారించారు వైద్యులు. కరోనా లక్షణాలతో సౌదీ నుంచి వచ్చిన ఈ వృద్ధుడు ఇటీవల ఓ ఆసుపత్రిలో చేరారు. అతడి నమూనాలను వైద్య పరీక్షల కోసం.. పుణెకు పంపగా .. రిపోర్ట్‌లో పాజిటివ్‌ అని తేలింది. అంతకుందు.. తెలంగాణలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలోనూ అతడు చికిత్స పొందినట్లు తెలుస్తోంది. దీంతో... వృద్ధుడి మృతిపై.. తెలంగాణ ప్రభుత్వానికి కర్ణాటక ఆరోగ్యశాఖ సమాచారం అందించింది.

Next Story

RELATED STORIES