జగన్ తన అధికార దాహాన్ని వీడి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలి : లోకేశ్

జగన్ తన అధికార దాహాన్ని వీడి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలి : లోకేశ్

సీఎం జగన్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. జగన్ ఈగో రాష్ట్రానికి శాపంగా మారిందంటూ ట్వీట్‌ చేశారు. దేశంలోని ప్రతి రాష్ట్రం కరోనా నియంత్రణ చర్యలు చేపడుతుంటే.. జగన్‌ మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా తన అధికార దాహాన్ని వీడి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని విజ్ఙప్తి చేశారు లోకేష్.

సీఎం స్థాయి వ్యక్తి కులం గురించి మాట్లాడడం బాధాకరమన్నారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. ఏపీ ప్రభుత్వం ఎన్నికల అధికారిపై హైకోర్టుకు వెళ్లకుండా సుప్రీంకోర్టుకు వచ్చారని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యం కన్నా ఎన్నికలే ముఖ్యం అనేలా జగన్ తీరు ఉందన్నారు. బీజేపీ, టీడీపీ నాయకులపై దాడులు చేశారని సుజనాచౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకగ్రీవం అయిన చోట్ల మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్నారు.

వైసీపీ సర్కార్‌ తీరుపై టీడీపీ నేత కళావెంకట్రావ్‌ ఫైర్‌ అయ్యారు. ఎన్నికల అధికారికి కులం అంటగట్టడమేంటని మండిపడ్డారు. కోర్టులు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా ప్రభుత్వం తీరుమారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో రిగ్గుంగు చేయాలనే లక్ష్యంతోనే తొందరపడుతున్నారని ఆరోపించారు.

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ ధోరణి మారాలని సూచించారు. సీఎం ఎవరైనా పరిధి ఉన్నంత వరకే పని చేయాలన్నారు. సీఎం కదా తానే సర్వం అనుకుంటే కుదరదన్నారు. ఎవరైనా సరే అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని మాత్రమే అమలు చేయాలని సూచించారు.. ఎస్‌ఈసీని సీఎం సహా, మంత్రులంతా కులం పేరుతో విమర్శించడం సరైంది కాదని జీవీఎల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story