జనతా కర్ఫ్యూ.. దేశవ్యాప్తంగా నిలిచిపోనున్న ట్రైన్లు

జనతా కర్ఫ్యూ.. దేశవ్యాప్తంగా నిలిచిపోనున్న ట్రైన్లు
X

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భరతం పట్టేందుకు భారత్ సిద్ధమైంది. రాకాసి పురుగును తరమికొట్టేందుకు.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతిఒక్కరూ ఉక్కుసంకల్పంతో వున్నారు. ప్రధాని మోదీ పిలుపుమేరకు జనభారతం జనతా కర్ఫ్యూకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆదివారం ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోనున్నాయి. ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు రైళ్లు నిలిచిపోనున్నాయి. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ రైళ్లు రెండు మూడింటిని అవసరాన్ని బట్టి నడిపించే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. ఆదివారం ఉదయం 7 గంటలకు ముందే ప్రయాణం ప్రారంభించిన దూరప్రాంత రైళ్లు మాత్రం యథావిధిగా గమ్యం వైపు వెళ్లనున్నాయి.

Next Story

RELATED STORIES