ఎనిమిది నెలల చిన్నారికి కరోనా

ఎనిమిది నెలల చిన్నారికి కరోనా
X

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ను నియంత్రించడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇండియాలో వేగంగా విజృంభిస్తూ ఎంతో ప్రాణాలు బలిగొంటున్న కరోనా వైరస్‌.. చిన్నారులను సైతం వదలడం లేదు. తాజాగా ఇద్దరు పిల్లలకు కరోనా సోకింది. వీరిలో ఒకరు 8 నెలల చిన్నారి కావడం విశేషం. దేశంలో కరోనా సోకిన అత్యంత పిన్న వయస్కురాలు ఈ చిన్నారే. మరొకరు ఏడు సంవత్సరాల బాలిక. ఈ చిన్నారులు సౌదీ అరేబియా నుంచి ఇటీవలే శ్రీనగర్‌కు తిరిగివచ్చి కోవిడ్‌-19 పాజిటివ్‌గా గుర్తించిన వ్యక్తి మనవళ్లని అధికారులు చెబుతున్నారు. ఈ రెండు తాజా కేసులతో జమ్ము కశ్మీర్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 11కు చేరింది.

Next Story

RELATED STORIES