పొగరాయుళ్లకు 14 రెట్లు ఎక్కువ కరోనా ముప్పు

పొగరాయుళ్లకు 14 రెట్లు ఎక్కువ కరోనా ముప్పు

పొగరాయుళ్లపై కరోనా వైరస్ పగ పడుతోంది. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 14 రెట్లు పొగరాయుళ్లకు కరోనా వల్ల ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి భయంకరమైన వైరస్ పొగతాగేవారికి తేలిగ్గా సోకుతుందని.. త్వరగా బలితీసుకుంటుందని చైనా శాస్త్రవేత్తలు తేల్చారు. సాధారణంగా పొగతాగేవారికి ఊపిరి తిత్తులు వీక్ అవుతాయట.. కరోనా వైరస్ తొలిపంజా ఊపిరి తిత్తులపైనే ఉంటుంది. అందుకే పొగరాయుళ్లు యమ డేంజర్ జోన్ లో వున్నట్టేనని అంటున్నారు. పొగరాయుళ్లను కరోనా కసితీరా కాటేస్తుందట, కోవిడ్ రోగం సోకిన వేలమందిపై పరిశోధనలు చేసిన అనంతరం ఈ విషయాన్నీ వెల్లడించారు నిపుణులు. చైనాలో వెలువడే హెల్త్ జర్నల్ లోను ఈ విషయాన్నీ పేర్కొన్నారు. కరోనా వైరస్ సోకితే చాతి, ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ వస్తుంది.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

వైరస్ కారణంగా ఊపిరి తిత్తులు తీవ్రంగా దెబ్బతింటాయి. పొగతాగేవారిలో అప్పటికే ఊపిరితిత్తులు బలహీనంగా ఉంటాయి.. దాంతో రోగ నిరోధక శక్తీ తక్కువగా ఉంటుంది. దీంతో కరోనా వైరస్ ప్రభావం వీరిపై ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శ్వాసకోశ వ్యాధుల తోపాటూ వృద్ధులు, మధుమేహం ఉన్న వారు కోవిడ్ కు బలి అవుతున్నట్టు స్పష్టం చేశారు. మరోవైపు ఊపిరి తిత్తులు ఎప్పటికప్పుడు వాటికవే శుభ్రం చేసుకుంటూ ఉంటాయి, మ్యూకస్ ను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి.. పొగతాగే వారిలో మ్యూకస్ పొర మందంగా ఉంటుంది, దాంతో వ్యర్ధాలను బయటికి పంపడం చాలా కష్టతరం అవుతుంది. ఇది కరోనాకు కలిసి వస్తుందని భారతీయ వైద్యులు చెబుతున్నారు. సో.. పొగతాగే అలవాటున్న వారు ఇప్పటికైనా మానెయ్యడం మంచిదని సూచిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story