మీరంతా కనీసం కోటి రూపాయలు ఇవ్వాలి: వెంకయ్య నాయుడు

మీరంతా కనీసం కోటి రూపాయలు ఇవ్వాలి: వెంకయ్య నాయుడు
X

కరోనాపై పోరాటానికి రాజ్యసభ సభ్యులు సాయం చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఎంపీఎల్ఏడీ నిధుల నుంచి ప్రతి ఒక్కరు కనీసం ఒక కోటి రూపాయల చొప్పున కోవిడ్‌పై పోరాటం కోసం కేటాయించాలని కోరారు.

కరోనా వలన ఏర్పడిన అసాధారణ పరిస్థితులు వివరిస్తూ రాజ్యసభ ఎంపీలకు రాసిన లేఖలో ఈ మేరకు సాయం చేయాలని కోరారు. ప్రభుత్వంతోపాటు.. ప్రైవేటు రంగంలోని ప్రముఖులు కూడా కృషి చేసారున్నారని అన్నారు. కరోనాపై విజయవంతంగా పోరాడాలంటే ఆర్థిక, వస్తు, మానవ వనరులు పెద్ద ఎత్తున అవసరమని స్పష్టం చేసారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో నిధులు అందుబాటులో ఉండటం కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వనరులను సేకరిస్తోందన్నారు.

Next Story

RELATED STORIES