దాచుకున్న డబ్బులను విరాళంగా ఇచ్చిన మోదీ తల్లి

X
TV5 Telugu31 March 2020 10:30 PM GMT
కరోనా మహమ్మారిపై పోరాటం కోసం ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన పీఎమ్ కేర్స్‌కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. వీరితో పాటు సామాన్య ప్రజలు కూడా తమకు తోచినంత సాయం చేస్తున్నారు. తాజాగా ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ సైతం తనవంతు సాయం అందించారు. ఆమె ఎన్నో సంవత్సరాలుగా పొదుపు చేసుకుంటున్న సొమ్ములో నుంచి రూ.25,000 లను పీఎం కేర్స్ విరాళంగా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తల్లిపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.
Next Story