మీకోసం వార్తలందిస్తుంటే నాక్కూడా..

మీకోసం వార్తలందిస్తుంటే నాక్కూడా..

పరిస్థితులు ఎలా ఉన్నా పని చేస్తుంటారు కొందరు. కొందరి వృత్తులు అలాంటివి. ప్రపంచంలో ఏమూల ఏం జరుగుతుందో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత జర్నలిస్టులకు ఉంటుంది. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లలోనే ఉండి టీవీలకు, ఫోన్లకు పరిమితమయ్యారు. మరి వారికి ఎప్పటికప్పుడు సమాచారం అందించే నిమిత్తం యాంకర్లు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రసిద్ధ చానెల్ సీఎన్ఎన్ ప్రైమ్ టైమ్ న్యూస్ యాంకర్‌గా పని చేస్తున్న క్రిస్ క్యూమో.. గత కొద్ది రోజులుగా కరోనా రోగులతో పలు కార్యక్రమాలు చేశారు. దాంతో అతడికి కూడా కరోనా వైరస్ అంటుకుంది. ఈ విషయాన్ని క్రిస్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. పాజిటివ్ అని తెలియడంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కాగా, ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారిసంఖ్య 8,59,032. అందులో మరణాల సంఖ్య 42,322కు చేరుకోగా, కోలుకున్న వారి సంఖ్య 1,78,101.

Tags

Read MoreRead Less
Next Story