యూనియన్ బ్యాంక్ ఇండియాలో ఆ రెండు బ్యాంక్ ల విలీనం పూర్తి

యూనియన్ బ్యాంక్ ఇండియాలో ఆ రెండు బ్యాంక్ ల విలీనం పూర్తి

ఇండియాలో ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ లు యూనియన్ బ్యాంక్ విలీనం అయ్యాయి. ఈ ప్రక్రియ సజావుగా సాగిపోయింది. సంయుక్తంగా చూస్తే మూడు వందల ఏళ్లకంటే ఎక్కువ ఘనకీర్తి బ్యాంకింగ్ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్టయింది. దేశంలో అతిపెద్ద బ్యాంక్ గా అవతరించిన యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియాకు దేశవ్యాప్తంగా 9500 కంటే ఎక్కువ బ్రాంచులు ఉన్నాయి. అంతేకాదు 13500 కంటే ఎక్కువగా ఏటీఎంలు ఉన్నాయి. విలీనం పూర్తి అయినప్పటికీ ఆంధ్రాబ్యాంక్ , కార్పొరేషన్ బ్యాంక్ కస్టమర్ల అకౌంట్ నంబర్లు, చెక్ బుక్ లు, డెబిట్, క్రెడిట్ కార్డు దారులు ఇంటర్నెట్ , మొబైల్ బ్యాంకింగ్ సేవల్లో ఎలాంటి మార్పులు ఉండవని యూనియన్ బ్యాంక్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story