భారత్ లో పెరిగిన ఐఫోన్‌ ధరలు

భారత్ లో పెరిగిన ఐఫోన్‌ ధరలు

భారత్ లో ఐఫోన్‌ ప్రియులకు షాక్ తగిలింది. కరోనా వైరస్ కారణంగా ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో భారత ప్రభుత్వం మొబైల్ ఫోన్లు మరియు 'నిర్దిష్ట' భాగాలపై 12 శాతం ఉన్న జీఎస్టీ ఇప్పుడు 18 శాతానికి పెరగడంతో రేట్లలో మార్పులు చేయక తప్పని పరిస్థితి. మరోవైపు కరోనా కారణంగా ఆపిల్ ఉత్పత్తి ఆగిపోవడంతో డిమాండ్ ఎక్కువగా ఉంది.

ఈ కారణాలతో ఆపిల్‌ ఫోన్ల ధరలు ఒక్కసారిగా పెరిగాయి.. సవరించిన ధరలు ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఇందులో భాగంగా 64 జీబీ ఐఫోన్‌ 11 ధర రూ.64,900 నుంచి రూ.68,300లకు చేరింది. 64 జీబీ ఎక్స్‌ఆర్‌ మోడల్‌ రూ.2,600 పెరిగి రూ.52,500లకు చేరింది. ఇక రూ.1,01,200 64 జీబీ 11 ప్రో ధర.. రూ.1,06,600 కు పెరిగింది. 64 జీబీ 11 ప్రో మ్యాక్స్‌ రూ.1,11,200 నుంచి రూ.1,17,100కు చేరుకుంది. ఇక 32 జీబీ ఐఫోన్‌ 7 రూ.1,600 పెరిగి రూ.31,500లుగా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story