సౌదీలో కరోనా కాటుకి బలైన కేరళ వాసి

సౌదీలో కరోనా కాటుకి బలైన కేరళ వాసి
X

సౌదీ అరేబియాలో ఓ భారతీయ యువకుడిని కరోనా మహమ్మారి బలి తీసుకుంది. కేరళకు చెందిన ఆ యువకుడు.. మ‌దీనాలోని జ‌ర్మ‌న్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ శ‌నివారం మృతిచెందాడు. అతని మ‌ర‌ణ‌వార్త‌ను బంధువులు.. అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు ఫోన్ ద్వారా తెలియ‌జేశారు.

మృతి చెందిన ఆ యువకుడు ఈ ఏడాది జ‌న‌వ‌రి 5న వివాహం చేసుకొని.. మార్చి 10న సౌదీకి వెళ్లిపోయాడు. అక్క‌డ వెళ్లిన త‌ర్వాత కరోనా సోకటంతో.. చికిత్స పొందుతూ శ‌నివారం ప్రాణాలొదిలాడు. అత‌ని మృతితో కుటుంబ స‌భ్యులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

Next Story

RELATED STORIES