Coronavirus : భారత్ లో 24 గంటల్లో 540 కొత్త కేసులు

Coronavirus : భారత్ లో 24 గంటల్లో 540 కొత్త కేసులు
X

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.. తాజాగా గత 24 గంటల్లో 540 కొత్త కేసులు నమోదయ్యాయి. ఉదయం 8 గంటలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్‌డేట్ చేసిన గణాంకాల ప్రకారం గురువారం ఉదయం నాటికి గత 24 గంటల్లో దాదాపు 540 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 5,700 చేరుకుంది. క్రియాశీల కోవిడ్ -19 కేసుల సంఖ్య 5,095 కాగా, 472 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. అలాగే దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 17 మరణాలు నమోదై మరణాల సంఖ్య 166 కు చేరుకుంది.

Next Story

RELATED STORIES