SECని తొలగించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది

SECని తొలగించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది

ఏపీ మాజీ ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ తొలగింపుతో పంతం నెగ్గించుకున్న ఏపీ ప్రభుత్వానికి మరో సవాల్ సిద్ధమవుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా పదవీకాలం కుదించి మరీ SECని పక్కనపెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోబోతోంది. ఏపీ ప్రభుత్వంపై రమేష్ కుమార్ లీగల్ వార్ కు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఆర్డినెన్స్ కు చట్టబద్ధత లేదంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు రమేష్ కుమార్.. మరోవైపు న్యాయనిపుణులు చెబుతున్న దాని ప్రకారం ప్రభుత్వ ఆర్డినెన్స్ చెల్లదని అభిపాయపడుతున్నారు.

రాజ్యాంగంలో ఆర్టికల్ 243 k లో ఎన్నికల కమిషనర్ నియామకం స్పష్టంగా ఉంది. దీని ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు హైకోర్టు న్యాయమూర్తికి ఉన్నత ఉద్యోగ భద్రత ఉంటుంది. కచ్చితమైన కారణాలు ఉంటే తప్ప ఎన్నికల కమిషనర్ ను తొలగించే అవకాశం లేదు. అంతేకాదు sec తొలగింపు విధానంలో హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానాన్నే అనుసరించాల్సి ఉంటుంది. అంటే sec ని తొలగించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story