ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ కామెంట్స్.. వైరస్‌కి వ్యాక్సిన్!!

ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ కామెంట్స్.. వైరస్‌కి వ్యాక్సిన్!!

ప్రపంచాన్ని అంతం చేయగల అణుబాంబులు తయారు చేసే శక్తి ఉన్న దేశాలు సైతం కరోనాను కట్టడి చేయలేక చేతులెత్తేస్తున్నాయి. కనిపించని కరోనాతో రోజూ యుద్ధం చేస్తున్నాయి. లెక్కకు మించి ప్రాణాలు గాల్లో కలుస్తుంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయి. సామాజిక దూరాన్ని పాటిస్తే కొంచెమైనా వైరస్‌ను నియంత్రించొచ్చేమోనని లాక్‌డౌన్‌ని అమలు చేస్తున్నాయి మన దేశంతో సహా చాలా దేశాలు.

ఇంతగా ఇబ్బంది పెడుతున్న ఈ వైరస్‌కి మందు కనుక్కునే ప్రక్రియ నిరంతరంగా సాగుతూనే ఉంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వైరస్ బారినుంచి ఇప్పట్లో బయటపడే అవకాశాలు లేవని తేల్చి చెబుతోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు ఈ తిప్పలు తప్పవని అంటోంది. డబ్ల్యూహెచ్‌వో అధికార ప్రతినిధి డా.డేవిడ్ నాబర్రో ఈ మేరకు అంచనావేశారు. కొంత కాలం కరోనా తగ్గినట్లే కనిపించినా.. మళ్లీ తిరిగి విజృంభించే అవకాశాలు ఉన్నాయని ఆయన అంటున్నారు.

ఈ సమయంలో వైరస్‌ను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ లక్షణాలున్న వారిని వెంటనే ఐసోలేట్ చేసే పద్దతి కొనసాగిస్తూనే ఉండాలని సూచించారు. దీనికి ప్రపంచ దేశాలు సన్నద్ధంగా ఉండాలని అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో వైరస్ ప్రభావం కొన్ని రోజుల్లో తగ్గుతుందన్న అమెరికా ఆశలపై నీళ్లు చల్లేలా ఉన్నాయి డేవిడ్ చేసిన వ్యాఖ్యలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story