బిట్టూ సేవలు అమోఘం.. పోలీసుల ఘన నివాళి

బిట్టూ సేవలు అమోఘం.. పోలీసుల ఘన నివాళి
X

పోలీస్ శాఖకు విశేష సేవలు అందించిన తిరుపతి టాస్క్ ఫోర్స్ డాగ్ బిట్టు మరణించింది. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బిట్టు ఆదివారం ప్రాణాలు విడిచింది. 2016లో జన్మించిన బిట్టు అప్పటి నుంచి పోలీసుల సంరక్షణలోనే ఉండి శిక్షణ తీసుకుంది. మొయినాబాద్‌లో బిట్టూకు 8 నెలల శిక్షణ ఇచ్చారు పోలీసులు. అడవుల్లో స్మగ్లర్లు దాచిన ఎర్రచందనం దుంగలను గుర్తించడంలో పోలీసులకు సహాయపడేది. చాలా సార్లు తప్పించుకు తిరుగుతున్న స్మగ్లర్లను కూడా పోలీసులకు పట్టిచ్చేది. బిట్ట మరణంతో కలత చెందిన పోలీసులు.. బిట్టూ సేవలను గుర్తు చేసుకుంటూ ఘన మైన నివాళి అర్పించారు. బిట్టూ అంత్య క్రియల్లో టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏఎస్పీ రవిశంకర్‌తో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story

RELATED STORIES