లాక్‌డౌన్‌పై ప్రధాని ప్రసంగం నేడు

లాక్‌డౌన్‌పై ప్రధాని ప్రసంగం నేడు
X

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ముఖ్యంగా 21 రోజుల దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఈ రోజుతో ముగియనున్న సందర్బంగా మరికొన్ని రోజులు లాక్ డౌన్ ను పొడిగించే విషయమై ప్రధాని మాట్లాడే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించేందుకు నిబంధనల సడలింపు ఉండే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు వివిధ రాష్ట్రాలు ఏప్రిల్‌ 14 తరువాత కూడా కొన్ని రోజులపాటు లాక్ డౌన్ ను పొడిగించమని కోరాయి.

పంజాబ్, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్రలతో సహా పలు రాష్ట్రాలు ఇప్పటికే ఈ నెలాఖరు వరకు ఆంక్షలను పొడిగించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నుండి ఇంతవరకు ఎటువంటి ఆదేశాలు లేవు.. ప్రధానమంత్రి మోడీ మరియు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సమావేశం తరువాత, భారత్ లో మరణాలు, కేసుల సంఖ్య పెరిగింది. మరి ఇటువంటి సమయంలో లాక్ డౌన్ పై ఎటువంటి నిర్ణయం కేంద్రం ప్రభుత్వం తీసుకుంటుందో చూడాలి.

Next Story

RELATED STORIES